ములుగు జిల్లాలోని 9 మండలాల్లో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు నిరవధిక సమ్మె చేస్తున్నారు. చాలీచాలని వేతనాలతో 15 సంవత్సరాల నుంచి విధులు నిర్వర్తిస్తున్నామన్నారు. జీవో 4779 ప్రకారం వేతనంలో కోత విధిస్తారని తెలియడం వల్లనే సమ్మె చేస్తున్నట్లు తెలిపారు. సంబంధిత జీవోను వెంటనే రద్దుచేయాలని డిమాండ్ చేశారు. ఎండకు వానకు లెక్కచేయకుండా ఉపాధి హామీ కూలీలతో కలిసి పనిచేస్తున్నా.. సరైన గుర్తింపు లేదన్నారు.
రూ. 21 వేల వేతనం ఇవ్వాలని.. ఉద్యోగ భద్రత కల్పించాలని నినదించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.