గిరిజన జాతరకు వేలాది మంది భక్తులు తరలివస్తుంటే... వరంగల్-మేడారం మార్గంలో ప్రమాదాలు జరగకుండా పోలీసులు అనేక ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. పర్యాటక ప్రదేశాలకు మారు పేరుగా నిలిచిన ములుగు జిల్లాలోనే ఉన్న... లక్నవరం సరస్సు వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు. మార్గ మధ్యలో ఉన్న రామప్ప దేవాలయాన్ని చూసేందుకు మాత్రం పోలీసులు అనుమతిస్తున్నారు. దీంతో రామప్పకు వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వరంగల్ మేడారం రహదారిలోని పర్యాటక ప్రాంతాల్లోని పరిస్థితులను మా ప్రతినిధి అలీముద్దీన్ అందిస్తారు.
ఇదీ చూడండి: డోలు వాయిద్యాల నడుమ గద్దెపైకి సారలమ్మ