మావోలకు సహకరించొద్దంటూ.. ములుగు ఏఎస్‌పీ సాయి చైతన్య గోండుకోయ గిరిజనులను కోరారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారికి ఎవరు సహాయం చేయకూడదన్నారు. తెలియని వారు గ్రామాల్లోకి వస్తే.. వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. సీఆర్‌పీఎఫ్ బెటాలియన్‌తో కలిసి జిల్లా కేంద్రంలో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు.
సీఆర్‌పీఎఫ్ కమాండెంట్ విద్యాధర్.. గిరిజనులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. సోలార్ దీపాలు, వంట సామాగ్రితో పాటు గోండుకోయ గుడారాలకు ప్లాస్టిక్ వాటర్ ట్యాంకులను పంపిణీ చేశారు. యువకులకు వాలీబాల్, క్రికెట్ కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన ఓఎస్‌డీ శోభన్ కుమార్.. సీఆర్‌పీఎఫ్ బెటాలియన్ సేవలు మర్చిపోలేనివన్నారు. పేద గిరిజనులకు.. సహాయపడటం గర్వంగా ఉందన్నారు.
ఇదీ చదవండి: భవిష్యత్‌లో పోడు భూములకు కూడా రైతుబంధు ఇస్తాం: కేసీఆర్