ములుగు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. వాజేడు, వెంకటాపురం, ఏటూరు నాగారం, మంగపేట మండలాల్లో విరామం లేకుండా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. చెరువులు నిండి వాగులు, వంకలు పొంగి పొర్లడం వల్ల పంటపొలాలు నీట మునిగాయి. ఆగస్టు నెలలో కురిసిన వర్షాలకు వరిపంట పూర్తిగా నాశనం కాగా.. రైతులు మరోసారి నాట్లు వేశారు. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు నాట్లు మరోసారి కొట్టుకుపోయాయి. నష్టపోయిన తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఇవీ చూడండి: భయం భయం: భాగ్యనగరంలో డెత్ స్పాట్లుగా మ్యాన్ హోళ్లు