ప్రయాణాల్లో ఉన్నప్పుడు లేదా బయటకు వెళ్లినప్పుడు చరవాణీలో సినిమాలు సీరియల్స్ చూడడం సర్వసాధారణమై పోయింది. అయితే మామూలుగా చరవాణీలో చూస్తే టీవీలో చూసినట్టుగా అనిపించదు. అదే 3డీ స్క్రీన్లో చూస్తే ఆ అనుభూతే వేరు. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాకు చెందిన ముగ్గురు యువకులు తమ ఆలోచనకు మంచి రాబడినిచ్చే ప్రాంతంగా మేడారం మహా జాతరను ఎంచుకున్నారు.
ముంబై నుంచి 3డీ స్క్రీన్లను తీసుకొచ్చి మేడారం జాతరలో విక్రయిస్తున్నారు. 100 రూపాయలకు ఒకటి అమ్ముతుండటం వల్ల చాలా మంది భక్తులు వాటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
ధర తక్కువగా ఉండడం వల్ల భక్తులు అధిక సంఖ్యలో వాటిని కొనుగోలు చేస్తున్నారని.. దానితో తమ విక్రయాలు పెరిగాయని అమ్మకపుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.