ETV Bharat / state

మారు పేర్లతో గాలం.. అందిన కాడికి మోసం.. - young woman cheating in the name of marriages

పెళ్లి పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఓ కిలాడీ లేడిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె వద్ద నుంచి రూ. 5 లక్షల 16 వేల నగదుతో పాటు ల్యాప్‌టాప్‌, 4 చరవాణులు, 4 ఏటీఎం కార్డులు, 7 సిమ్‌ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.

పెళ్లి పేరుతో మోసాలు... కిలాడీ లేడీ అరెస్ట్

author img

By

Published : Feb 26, 2021, 8:07 PM IST

వివాహం పేరుతో పలువురికి వల విసురుతూ మోసాలకు పాల్పడుతున్న యువతిని రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ఆమె వద్ద నుంచి రూ. 5 లక్షల 16 వేల నగదుతో పాటు ల్యాప్‌టాప్‌, 4 చరవాణులు, 4 ఏటీఎం కార్డులు, 7 సిమ్‌ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.

మారుపేర్లతో పోస్టులు...

ఏపీ నెల్లూరుకు చెందిన స్వాతి గత కొంతకాలంగా ఘట్‌కేసర్‌లోని పోచారంలో నివసిస్తోంది. ఎస్వీ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పూర్తి చేసింది. సైబరాబాద్‌, రాచకొండ, హైదరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలో పలువురిని మోసం చేసిన కేసుల్లో పోలీసులు గతంలో ఆమెను అరెస్టు చేశారు. సులభంగా డబ్బు సంపాదించాలని భావించి మాట్రిమోని సైట్లలో మారు పేర్లతో ప్రొఫైల్స్‌ పోస్టు చేసేది.

రకరకాల గొంతులు...

విదేశాల్లో స్థిరపడిన వారినే వివాహం చేసుకుంటానని ప్రకటనలు గుప్పించేదని పోలీసులు తెలిపారు. ఆమె ప్రకటనలను చూసి స్పందించే వారితో రకరకాల గొంతులను అనుకరించి మాట్లాడేది. ఇందుకోసం యాడ్‌కామ్‌ అనే సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. విదేశాల్లో స్థిరపడిన వారితో పెళ్లికి అంగీరించినట్టు ఫోన్‌లో మాట్లాడేది. ఈ తరహాలో పలువురితో మాట్లాడి పూర్తిగా నమ్మించింది.

నేరుగా సంప్రదించండి...

వారితో వివాహానికి డబ్బులు డిమాండ్‌ చేసి మరి తీసుకుని ఆ తర్వాత కనిపించకుండా పోయేది. బాధితులు ఘరానా మోసాలకు పాల్పడుతున్న యువతిపై ఫిర్యాదు చేయగా... రంగంలోకి దిగిన పోలీసులు శాస్త్రీయ ఆధారాల ద్వారా ఆమెను గుర్తించి అరెస్టు చేశారు. ఈ తరహా యువతుల వలకు చిక్కవద్దని, యువకులు వివాహం చేసుకోదలిచిన వారిని నేరుగా సంప్రదించిన తర్వాతే నిర్ధరణకు రావాలని పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.

ఇదీ చూడండి: కిడ్నాప్​ కేసు: మూడు గంటల్లోనే ఛేదించిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.