ఆదాయం 5; వ్యయం 5
రాజపూజ్యం 5; అవమానం 2
కన్యారాశి వారికి పట్టుదల చాలా అవసరం. ముఖ్యకార్యాల్లో శ్రద్ధ పెంచి ఏకాగ్రచిత్తంతో పని చేస్తేనే విజయం వరిస్తుంది. ఉద్యోగంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. సకాలంలో పనులు పూర్తిచేయాలి. ధర్మచింతనతో బాధ్యతలని నిర్వర్తించండి. చిన్న పొరపాటు జరిగినా సమస్య జటిలమవుతుంది. సొంత నిర్ణయాలు శక్తినిస్తాయి. కుటుంబసభ్యుల సలహాతో ముందుకు సాగండి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి. బుద్ధిబలంతో ఆటంకాలను అధిగమించాలి.
విద్యార్థులు పట్టుదలతో అభ్యసించాలి. వ్యయం పెరగకుండా చూసుకోవాలి. పట్టు విడుపులతో కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా లక్ష్యాన్ని చేరుకోవచ్చు. మొహమాటం ఇబ్బంది కలిగిస్తుంది. నిరుత్సాహాన్ని దరిచేరనివ్వవద్దు. ఆశయ సాధనకు నిరంతరమైన ప్రయత్నం సాగాలి. సమాజ శ్రేయస్సు కోరి చేసే పనుల్లో దైవానుగ్రహం సిద్ధిస్తుంది. గురు, శని, రాహు శ్లోకాలు చదువుకోవాలి.