మానవత్వం మరిచిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మూగజీవులైన శునకాలను అతిక్రూరంగా హింసించారు. ఓ శునకం గొంతును తీగతో కట్టి బిగించారు. దీంతో మెడ లోతుగా తెగిపోయి.. తీవ్ర గాయంతో మూగజీవి విలవిలలాడింది. దాని పిల్లలకూ విషం పెట్టి చంపేశారు. ఈ హేయమైన ఘటన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ -బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ సమీపంలో జరిగింది.
తీవ్రంగా గాయపడిన శునకం అరుపులు విన్న స్థానికులు గుర్తించి బిట్స్ అధ్యాపకులకు సమాచారమిచ్చారు. వారు వచ్చి కుక్కకు వైద్యసేవలు అందించారు. మానవత్వంలేని కొందరు ఇలాంటి అతి క్రూరమైన అకృత్యాలకు పాల్పడుతున్నారని బిట్స్ అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి : కాళేశ్వరం మూడో టీఎంసీ పనులు చేపట్టొద్దు: కేంద్ర మంత్రి