ETV Bharat / state

'కేవలం వెస్ట్​సైడ్ వారినే తరలించారు.. ఇంకా చాలా మంది ఉన్నారు'

students stuck in Ukraine: ఉక్రెయిన్​లో యుద్ధ వాతావరణం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో అక్కడ చదువుకుంటున్న భారతీయులను స్వదేశానికి తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. కానీ మరోవైపు ఇంకా కొందరు విద్యార్థులు రష్యా​ సరిహద్దుల్లో చిక్కుకున్నారు. ఓ వైపు బాంబుల దాడులతో హైరానా పడుతున్న వారు.. తమను స్వదేశానికి ఎప్పుడు తరలిస్తారా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. వారు తలదాచుకున్న బంకర్ వీడియో చూపించారు విద్యార్థులు. ఇంకా వేల మంది ఉక్రెయిన్​లో ఉన్నారని.. భారత ప్రభుత్వం అందరిని తరలించేలా చర్యలు చేపట్టాలని వేడుకున్నారు.

'ఎప్పుడేం జరుగుతుందోనని భయంగా ఉంది.. త్వరగా ఇండియాకు చేర్చండి ప్లీజ్​..'

author img

By

Published : Feb 28, 2022, 10:18 AM IST

'ఎప్పుడేం జరుగుతుందోనని భయంగా ఉంది.. త్వరగా ఇండియాకు చేర్చండి ప్లీజ్​..'

students stuck in Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు తీవ్రమయ్యాయి. దీంతో అక్కడి భారత విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వారిని తీసుకొచ్చేందుకు కేంద్రం తీవ్రంగా కృషి చేస్తోంది. ఇప్పటికే పలు విమానాల్లో కొందరు ఇక్కడకు చేరుకున్నారు. తెలంగాణకు చెందిన వైద్య విద్యార్థులు ఉక్రెయిన్​లో చిక్కుకోగా భయంతో బిక్కుబిక్కుమంటూ బంకర్​లలో తలదాచుకున్నారు.

మేడ్చల్​ జిల్లా జీడిమెట్ల షాపూర్ నగర్​కు చెందిన విద్యార్థిని కల్పన ఖార్కివ్​ సిటీలో ఎంబీబీఎస్​ 4వ సంవత్సరం చదువుకుంటున్నారు. ప్రస్తుతం ఖార్కివ్​లో బాంబుల వర్షం మోగుతోందని కల్పనతో పాటు మరో తెలుగు విద్యార్థిని వెల్లడించారు. తమకు తినడానికి తిండి, నీరు సైతం అందుబాటులో లేవని వీడియోలో పేర్కొన్నారు. సుమారు ఐదు వేల మంది భారత విద్యార్థులు తమ పరిసరాల్లో ఉన్నారన్నారు. భారత ఎంబసీ నుంచి తమకి ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. తమను త్వరగా ఇండియాకి చేర్చాలని వేడుకుంటున్నారు. వారు తలదాచుకున్న బంకర్ వీడియో చూపించారు విద్యార్థులు. కేవలం వెస్ట్ సైడ్ ఉన్నవారిని మాత్రమే భారత్​కు తరలిస్తున్నారన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమకు సహకారం అందించాలని వేడుకున్నారు. ఇంకా వేల మంది ఉక్రెయిన్​లో ఉన్నారని.. భారత ప్రభుత్వం అందరిని తరలించేలా చర్యలు చేపట్టాలని వేడుకున్నారు.

త్వరగా తీసుకెళ్లండి ప్లీజ్​..

శనివారం నుంచి ఖార్కివ్​ నగరంలో బాంబు పేలుళ్లు ఎక్కువయ్యాయి. ప్రతిక్షణం బాంబుల శబ్ధాలు వినపడుతూనే ఉన్నాయి. ఎప్పుడేం జరుగుతుందోనని భయంగా ఉంది. ఉండడానికి సరైన స్థలం కూడా లేదు. తినడానికి తిండి, తాగడానికి నీళ్లు కూడా లేవు. దాదాపు భారత విద్యార్థులు ఐదు వేల మంది వరకు ఉంటారు. అందరూ వార్తలు చూసి భారత విద్యార్థులందరూ వచ్చారని అనుకుంటున్నారు.. కానీ ఇంకా వేల మంది విద్యార్థులు ఇక్కడే ఉన్నారు.

తెలుగు వాళ్లమే 500 నుంచి 600 మంది వరకు ఉన్నాం. భారత ప్రభుత్వం నుంచి తమను ఎప్పుడు తరలిస్తారనే విషయంపై సరైన స్పందన కూడా లేదు. పశ్చిమ దిశలో ఉన్న 30 మంది విద్యార్థులను తరలించి అందరినీ తీసుకెళ్లామంటున్నారు. కానీ ఇప్పటివరకు మాకు ఎలాంటి సమాచారం లేదు. ఎప్పుడు తరలిస్తారనేది కూడా తెలీదు. ఇక్కడ ఉండే పరిస్థితి కూడా లేదు. మంచు కురియడం వల్ల చాలా చలిగా ఉంటోంది. రష్యా వారు న్యూక్లియర్​ దాడికి పాల్పడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దయచేసి భారత ప్రభుత్వం త్వరగా తరలించాలని వేడుకుంటున్నాం. చాలా మంది ఇలానే బంకర్స్​లోనే ఉంటున్నారు. ఏ సమయంలోనైనా మొబైల్​ సిగ్నల్స్​ ఆగిపోవచ్చని చెబుతున్నారు. సరిహద్దులకు వెళ్లమని చెబుతున్నారు. కానీ అది అసాధ్యం. మాకు సరిహద్దుకు 1400 కి.మీ దూరం ఉంది. ఇంట్లో నుంచి బయటకు వెళ్లే పరిస్థితే లేదు. అలాంటిది సరిహద్దు వరకు అంటే ఎలానో ఆలోచించాలి. ప్లీజ్​.. భారత ప్రభుత్వం త్వరగా చర్యలు చేపట్టాలి. కేసీఆర్ సార్​​, జగన్​ సార్​ మమ్మల్ని త్వరగా తీసుకెళ్లండి ప్లీజ్​..

-ఉక్రెయిన్​లో తెలుగు విద్యార్థులు

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.