గురువారం మరణించిన తెలంగాణ ఉద్యమకారుడు, కాంగ్రెస్ సీనియర్ నేత ఆమోస్ అంత్యక్రియలు రేపు నిర్వహించనున్నారు. భౌతిక కాయానికి తెరాస నేత కె.కేశవరావు, ఎమ్మెల్సీ స్టీఫెన్, కాంగ్రెస్ నేత వీహెచ్, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్యతో పాటు పలువురు నేతలు నివాళులు అర్పించారు. ఆమోస్ను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని కుటుంబసభ్యులు, బంధువులు.. కేకేతో వాపోయారు. కనీసం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: తెలంగాణ ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్సీ ఆమోస్ కన్నుమూత