ETV Bharat / state

హీరోయిన్లు నా గర్ల్ ఫ్రెండ్స్ అంటూ ప్రచారం.. అరెస్ట్ - సునిశిత్​ను అరెస్ట్​ చేసిన కీసర పోలీసులు

యూట్యూబ్​ ఛానల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పోలీసులను కించపరిచారనే ఫిర్యాదుపై సునిశిత్​ అనే వ్యక్తిని మేడ్చల్​ జిల్లా కీసర పోలీసులు అరెస్ట్​ చేశారు. ముఖాముఖి చేసిన ఛానళ్లకు నోటీసులు ఇస్తామని పోలీసులు తెలిపారు.

sunisith arrested by kesara police of medchal district
పోలీసులను కించపరిచిన కేసులో సునిశిత్​ అరెస్ట్​
author img

By

Published : Jul 23, 2020, 10:29 PM IST

ప్రముఖ హీరోయిన్లు తన ప్రియురాళ్లని.. పలు పెద్ద సినిమాలకు తనే మొదటి హీరోనని.. రాజకీయాలు చేసి తప్పించారంటూ ఇంటర్వ్యూలు ఇచ్చిన సునిశిత్​ను కీసర పోలీసులు అరెస్ట్​ చేశారు. ఈనెల 17న ఓ యూట్యూబ్​ ఛానల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పోలీసులకు కించపరిచాడంటూ ఓ కానిస్టేబుల్​ ఇచ్చిన ఫిర్యాదుపై కీసర పోలీసులు చర్యలు తీసుకున్నారు.

కీసర రాంపల్లికి చెందిన సునిశిత్​ ఇబ్రహీంపట్నంలో ఇంజినీరింగ్​ పూర్తిచేశాడు. అనంతరం ఓ కళాశాలలో సహాయ ఆచార్యుడిగా పనిచేశాడు. ఆ సమయంలో విద్యార్థినులకు అసభ్య సందేశాలు పంపిన కేసులో స్థానిక ఠాణాలో రెండు కేసులు నమోదయినట్లు పోలీసులు తెలిపారు. ఫలితంగా ఉద్యోగం పోయిందని పేర్కొన్నారు. అనంతరం పలువురు హీరోలు, కథానాయికలపై తప్పుడు ప్రచారం చేసినట్లు తెలిపారు. గతంలో నటి లావణ్య త్రిపాఠి ఫిర్యాదుపై హైదరాబాద్​ సైబర్​ క్రైం పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదయింది.

ఇటీవల ఈనెల 17న ఓ యూట్యూబ్​ ఛానల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పోలీసులను కించపరిచినట్లు కీసర పోలీసులు తెలిపారు. ఓ కానిస్టేబుల్​ ఫిర్యాదుపై సునిశిత్​ను అరెస్ట్​ చేసినట్లు పేర్కొన్నారు. కేవలం ప్రచారం కోసమే ఇటువంటి పనులు చేస్తున్నట్లు భావిస్తున్నామన్నారు. ఇతనిపై నమోదైన కేసుల్లో ఆయా పోలీస్​ స్టేషన్లకు సమాచారం ఇస్తామని కీసర పోలీసులు తెలిపారు.

పోలీసులను కించపరిచిన కేసులో సునిశిత్​ అరెస్ట్​

ఇవీచూడండి: మంచం అమ్మకానికి పెట్టి.. రూ.లక్ష మోసపోయిన మహిళ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.