మేడ్చల్ పీయస్ పరిధిలోని కండ్లకోయ సీఎంఆర్ కళాశాల వసతి గృహంలో విద్యార్థిని అదృశ్యమైంది. బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న కావ్య(18)... హాస్టల్లో ఉంటూ చదువుకుంటోంది. యువతి అదృశ్యంపై తల్లిదండ్రులకు యజమాన్యం సమాచారమిచ్చింది. ఎవరో వ్యక్తి తనను తీసుకెళ్లినట్లు కళాశాల యాజమాన్యం తెలిపింది.
మూడు రోజుల నుంచి అమ్మాయి కనిపించకపోతే... ఆలస్యంగా సమాచారం ఇచ్చారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. అసలు బయటకు తెలియని వ్యక్తితో ఎలా పంపిస్తారని మండిపడ్డారు. తన కూతుర్ని తెచ్చి ఇచ్చే వరకు హాస్టల్ ఎదుట నుంచి కదలనని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చూడండి: గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత.. తిరంగ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు