మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జగద్గిరిగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలోని గాజులరామారం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న తండ్రీకొడుకుని కారు ఢీ కొట్టిన ఘటనలో తండ్రి మృతి చెందగా... కుమారుడు గాయపడ్డాడు. ఎల్లమ్మబండకు చెందిన రాములు, అతని కుమారుడు వెంకటేశ్వర చారి... షాపుర్నగర్లో పని ముగించుకుని ద్విచక్రవాహనంపై ఇంటికి తిరుగుపయణమయ్యారు. గాజులరామారం సమీపంలోకి రాగానే ఓ కారు వీరి వాహనాన్ని ఢీ కొట్టింది. ప్రమాదంలో రాములు ఘటనాస్థలిలోనే మృతిచెందాడు. గాయపడ్డ వెంకటేశ్వర చారిని ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి: కూలీలతో వెళ్తున్న ఆటోను ఢీకొట్టిన కారు