ETV Bharat / state

బీజేపీ అధికారంలోకి రాగానే - అవినీతికి పాల్పడిన వారందరినీ జైలుకు పంపిస్తాం : రాజ్‌నాథ్​సింగ్ - telangana assembly election 2023

Rajnath Singh Election Campaign in Medchal : రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే అవినీతికి పాల్పడిన వారందరినీ జైలుకు పంపిస్తామని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మేడ్చల్‌ జిల్లాలో జరిగిన బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభకు హాజరయ్యారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పని చేస్తామని హామీ ఇచ్చారు.

Rajnath Singh Election Campain 2023
Rajnath Singh Election Campain in Telangana
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 24, 2023, 9:22 PM IST

Rajnath Singh Election Campaign in Medchal : తెలంగాణలో ఎన్నికల దృష్ట్యా దేశంలో ముఖ్య నాయకులందరూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. జాతీయ పార్టీల క్యాంపెయినర్లు రాష్ట్రంలో వివిధ నియోజకవర్గాల్లో జరుగుతున్న సమావేశాల్లో పాల్గొని.. ఆయా పార్టీల తరుఫున ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ(BJP)కి సంబంధించిన అగ్ర నాయకులు ఇప్పటికే పలువురు నాయకులు రాష్ట్రంలో పర్యటించారు.

ఈ క్రమంలోనే కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఎన్నికల ప్రచారానికి హాజరయ్యారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లిలో బీజేపీ నాయకులు నిర్వహించిన సకల జనుల సంకల్ప సభ(BJP Public Meeting)లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో 10 సంవత్సరాలుగా హామీలు ఇచ్చి.. వాటిని నెరవేర్చలేదని విమర్శించారు.

Rajnath Singh Comments on BRS : తెలంగాణలో కచ్చితంగా బీజేపీ ప్రభుత్వాన్ని నెలకొల్పుతామని రాజ్‌నాథ్‌ సింగ్‌(Rajnath Singh) ధీమా వ్యక్తం చేశారు. 27 సంవత్సరాలుగా గుజరాత్‌ను దేశంలోనే ఒక మోడల్‌గా అభివృద్ధి చేశామని.. తెలంగాణ ఎందుకు అభివృద్ధి చెందలేదని కేసీఆర్‌ను ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్(KCR) కుటుంబం అవినీతిలో కూరుకుపోయిందని వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి రాగానే కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పని చేస్తుందని భరోసా ఇచ్చారు. అటల్ బిహారీ వాజపేయి నుంచి, మోదీ వరకు నాయకులపై ఏ ఒక్క అవినీతి మచ్చ లేదని తెలిపారు.

ప్రచారంలో కనబడని బీజేపీ స్టార్ క్యాంపెయినర్లు - నాయకత్వంపై ఆశలు పెట్టుకోకుండా శ్రమిస్తున్న అభ్యర్థులు

Rajnath Singh Election Campain in Telangana : కుటుంబానికి ఒక్క ఉద్యోగం ఇస్తానని చెప్పిన కేసీఆర్.. మోసం చేసి పేపర్ లీకేజ్‌లు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని.. ఏ ఒక్క దళితుడికీ ఇవ్వలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి జరిగిందని.. బీజేపీ అధికారంలోకి రాగానే అవినీతికి పాల్పడిన వారిని జైలుకు పంపిస్తామని రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు.

బీజేపీలో అసమ్మతి జ్వాల - అసంతృప్తులను బుజ్జగించే పనిలో రాష్ట్ర నాయకత్వం

"రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే అవినీతికి పాల్పడిన వారందరినీ జైలుకు పంపిస్తాం. కేసీఆర్ కుటుంబం అవినీతిలో కూరుకుపోయింది. కుటుంబానికి ఒక్క ఉద్యోగం ఇస్తానని కేసీఆర్ చెప్పారు. పేపర్ లీకేజ్‌లతో బీఆర్ఎస్‌ ప్రభుత్వం మోసం చేసింది. కేంద్రంలో ప్రధాని మోదీ పాలన ఆదర్శనీయంగా కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో బీజేపీని తెలంగాణలో గెలిపించాలి."- రాజ్‌నాథ్‌ సింగ్‌, కేంద్ర రక్షణ శాఖ మంత్రి

బీజేపీ అధికారంలోకి రాగానే వారిని జైలుకు పంపిస్తాం

Rajnath Singh Fire on KCR : కేంద్రంలో ప్రధాని మోదీ పాలన ఆదర్శనీయంగా కొనసాగుతోందని.. తెలంగాణలో ప్రజాస్వామ్య పరిపాలన నడవడం లేదని రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. ఆర్టికల్‌ 370(Article 370), ట్రిపుల్‌ తలాక్‌తో పాటు ఎన్నో సంచలనాత్మక అంశాలను పరిష్కరించామని తెలిపారు. పార్లమెంట్‌లో అనేక బిల్లులు ప్రవేశపెట్టామని చెప్పారు. 2025 జనవరి 22న అయోధ్యలో రామ మందిర ప్రారంభం కానుందని.. తెలంగాణ ప్రజలందరూ దర్శించుకోవాలని సూచించారు. దేశంలోనే అత్యంత విశ్వసనీయ పార్టీ బీజేపీని తెలంగాణలో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

కమలదళం ప్రచార జోరు త్వరలోనే రంగంలోకి అగ్రనేతలు

BJP Focus on Lok Sabha elections 2024 : ముచ్చటగా మూడోసారి కమలం వికసించేనా..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.