ETV Bharat / state

Vaccination: ప్రజలకు తప్పని టీకా పాట్లు.. గంటల తరబడి నిరీక్షణ

కరోనా టీకా కోసం జనం తరలివస్తున్నారు. గంటల తరబడి లైన్లలో ఎదురుచూస్తున్నారు. అయినా కొన్నిచోట్ల వ్యాక్సిన్ లేదని చెప్పడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. టీకా కేంద్రాల్లో సరైన ఏర్పాట్లు చేయలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Vaccination problems in medchal, vaccination problems in khammam
కుషాయిగూడలో వ్యాక్సినేషన్ తిప్పలు, ఖమ్మంలో టీకా సమస్యలు
author img

By

Published : Jul 17, 2021, 2:31 PM IST

తప్పని టీకా పాట్లు

కరోనా టీకా కోసం ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. వ్యాక్సిన్ కోసం గంటల తరబడి వేచిచూస్తున్నారు. అయినా కొందరికీ టీకా దొరకడం లేదు. మేడ్చల్‌ జిల్లా కుషాయిగూడ వ్యాక్సినేషన్‌ కేంద్రంలో రోజుకు 20 మందికి మాత్రమే ఇస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీకా అయిపోయిందని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని పేర్కొన్నారు. ఉదయం నుంచి గంటల తరబడి వేచిచూసి... వెనుదిరుగుతున్నామని వాపోయారు. అధికారులు, సిబ్బంది కనీసం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

ఉదయం ఆరు గంటల నుంచి వచ్చి ఎదురుచూస్తున్నాం. చివరకు వ్యాక్సిన్ అయిపోయిందని నిర్లక్ష్యంగా చెబుతున్నారు. స్లాట్ బుక్ చేసుకొనే కదా వచ్చాం. డోసుల గురించి సమాచారం ఉండదా? మూడు రోజుల నుంచి టీకా కేంద్రాలకు వస్తున్నా వ్యాక్సిన్ లేదని చెబుతున్నారు. టీకా వేసినట్లు మెసేజ్ వచ్చింది. కానీ వ్యాక్సిన్ ఇవ్వలేదు. మేం ఎవరిని అడగాలి? అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

-స్థానికులు

ఖమ్మంలో వ్యాక్సిన్‌ ప్రక్రియ గందరగోళంగా సాగుతోంది. టీకా వేసుకుంటే రక్షణ సంగతి అటుంచితే.. లేని రోగాలు వచ్చేలా ఉన్నాయని ప్రజలు వాపోతున్నారు. నగరం మొత్తం ఒకే చోట వ్యాక్సిన్‌ వేస్తుండటంతో టీకా కోసం భారీగా జనం ఎగబడ్డారు. జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో రెండో డోసు మాత్రమే వేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. గంటల తరబడి లైన్లల్లో నిలబడినా... టీకా దొరుకుతుందో లేదో అని వాపోతున్నారు. ఎవరూ భౌతికదూరం పాటించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

టీకా వేసుకోవడం కన్నా... ఇక్కడే వైరస్ సోకుతుందేమోనని భయంగా ఉంది. ఒకే కేంద్రం ఉండడం వల్ల జనం ఎక్కువగా వస్తున్నారు. గంటల తరబడి లైన్లలో ఎదురుచూస్తున్నాం. జనం ఎవ్వరూ భౌతిక దూరం పాటించడం లేదు. వెయ్యి మందికి ఒకేదగ్గర వ్యాక్సిన్ ఇవ్వడం కరెక్ట్ కాదు. వేరే కేంద్రాలను ఏర్పాటు చేయాలి. లేదంటే వెయ్యి మందికి తగిన విధంగా ఏర్పాట్లు చేయాలి. చివరకు టీకా దొరుకుతుందో లేదో అనుమానమే.

-స్థానికులు

ఖమ్మంలోని జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో రెండో డోసు మాత్రమే ఇస్తున్నాం. మెసేజ్ చూసి టీకా ఇస్తాం. నగరంలో ఒకటే కేంద్రం ఉంది. వెయ్యి మందికి టీకా ఇస్తాం. వంద మందిని పంపించేలాగా చర్యలు చేపట్టాం. కానీ ఎవరూ మాట వినడం లేదు. కొవాగ్జిన్ దొరకడం లేదని ప్రజలు ఎగబడుతున్నారు. ఖమ్మంలో కేసులు పెరగడం వల్ల టీకా కోసం తరలివస్తున్నారు.

లక్ష్మి, ఆరోగ్య సిబ్బంది

ఇదీ చదవండి: పారిశుద్ధ్య కార్మికురాలు.. డిప్యూటీ కలెక్టరయ్యింది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.