ETV Bharat / state

మల్లారెడ్డి ఆస్పత్రి ఎదుట పీపీఈ కిట్లతో ఎన్​ఎస్​యూఐ ధర్నా

మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా సూరారంలోని మల్లారెడ్డి ఆస్పత్రి ఎదుట ఎన్​ఎస్​యూఐ ఆందోళన చేపట్టింది. పీపీఈ కిట్లు ధరించి నిరసన తెలిపింది. ఈ సందర్భంగా ఆస్పత్రి సిబ్బంది.. విద్యార్థులకు మధ్య ఘర్షణ తలెత్తింది.

author img

By

Published : May 7, 2021, 4:50 PM IST

tension at mallareddy hospital
మల్లారెడ్డి ఆస్పత్రి ఎదుట ఎన్​ఎస్​యూఐ ఆందోళన

సూరారం చెరువు భూములు కబ్జా చేసి ఆస్పత్రి నిర్మించారని ఆరోపిస్తూ మల్లారెడ్డి ఆస్పత్రి హాస్పిటల్​ ఎదుట ఎన్​ఎస్​యూఐ అధ్యక్షుడు వెంకట్​ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పీపీఈ కిట్లు ధరించి సుమారు 20 మంది విద్యార్థులు ఆస్పత్రి ఎదుట నిరసన చేపట్టారు. దవాఖానా అద్దాలు ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రి సిబ్బంది, విద్యార్థులకు ఘర్షణ జరిగింది. ఆస్పత్రిలో ఉచితంగా కరోనా చికిత్స అందించాలని డిమాండ్​ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళనకారులను దుండిగల్​ పోలీస్​ స్టేషన్​కు తరలించారు. ఘటన స్థలాన్ని ఏసీపీ రామలింగరాజు పరిశీలించారు.

తమపై దాడికి పాల్పడ్డారంటూ ఆస్పత్రి వైద్యులు ఆరోపిస్తున్నారు. కొవిడ్​ బాధితులకు చికిత్స అందిస్తుండగా ఆందోళన చేయడం దారుణమన్నారు. తమ విధులకు ఆటంకం కలిగిస్తే ఇంట్లోనే కూర్చుంటామని హెచ్చరించారు.

ఈ ఘటనపై మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి స్పందించారు. కొవిడ్​ వంటి ఆపత్కాలంలో వైద్యులు సేవలందిస్తుంటే ఈ తరహా దాడులు సరికాదన్నారు.

ఇవీచూడండి: గాంధీ ఆస్పత్రిని సందర్శించిన సీఎస్​, సీపీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.