మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కాప్రా రాధిక చౌరస్తాలో నిన్న రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. మహిళ బైక్‌పై ముందు వెళ్తున్న సందర్భంలో లారీ ఆమె పైకి దూసుకొచ్చింది. ఆ ఘటనలో మహిళ అక్కడికక్కడే మరణించింది.
అక్కడ ఉన్న సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలించిన పోలీసులు లారీ నడుపుతున్న డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతి చెందిన సౌందర్య జీహెచ్ఎమ్సీలో సూపర్వైజర్గా పనిచేస్తుందని తెలిసింది.
ఇదీ చూడండి : ఇళ్లలోకి వెళ్లడు.. కానీ దొంగతనం చేస్తాడు