నిబంధనలు అతిక్రమించి నిర్మించిన ఐదంతస్తుల భవనాన్ని బోడుప్పల్ నగరపాలక సంస్థ అధికారులు సీజ్ చేశారు. మియాపూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని సర్వే నంబరు 6లోని రెడ్డి కాలనీలో ఓ స్థిరాస్తి వ్యాపారి నిర్మించిన భవనానికి సంబంధించి అనుమతి పత్రాలు చూపాలని అధికార్లు పలుమార్లు సూచించారు.
ఎంతకాలమైనా భవనం యజమాని నుంచి స్పందన లేకపోవడం వల్ల మున్సిపల్ కమిషనర్ బి.శ్రీనివాస్ ఆదేశాలపై అధికారులు భవనాన్ని సీజ్ చేశారు. సీల్‌ను తొలగిస్తే మున్సిపల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: కిరాక్ మోసం: 4ఎకరాలు చూపి కోటికి టోపి, అరెస్టు