'పట్నం గోస' కార్యక్రమం రాజకీయ లబ్ది కోసం చేస్తున్నది కాదని... ఆరేళ్లుగా సీఎం కేసీఆర్ చేస్తున్న మోసాలను ప్రజలకు తెలిపేందుకే చేపట్టానని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి చెప్పారు. నగరంలోని అల్వాల్ భూదేవినగర్ గిరిజన బస్తీల్లో ఆయన పర్యటించారు. కొన్నేళ్లుగా భూదేవినగర్ వాసులు రైలు పట్టాల పక్కన గుడిసెలు వేసుకుని దయనీయ స్థితిలో బతుకుతున్నారన్నారు.
ఇక్కడి ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రెండు పడక గదుల ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పి... ఇప్పటి వరకూ నిర్మించి ఇవ్వలేదని తెలిపారు. పక్కా ఇల్లు లేకుండా వర్షాకాలంలో ఇళ్లలోకి నీరు చేరి వీరు తీవ్ర అవస్థలకు గురవుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి గతంలో తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని... వెంటనే రెండు పడక గదుల ఇల్లు నిర్మాణం చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: 'రష్మికకు ట్వీట్ చేసింది కలెక్టర్ కాదు.. పరిశ్రమలశాఖ ఉద్యోగి'