ETV Bharat / state

'రాష్ట్రంలో పుట్టబోయే బిడ్డ మీద కూడా అప్పుంది' - mp revanth reddy latest updates

ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో పుట్టబోయే బిడ్డ మీద కూడా రూ. లక్ష పెట్టాడని ఆరోపించారు మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్​లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమావేశం నిర్వహించారు.

Congress party meeting conducted in jawahar nagar in Hyderabad
జవహర్​నగర్​లో కాంగ్రెస్ సమావేశం
author img

By

Published : Dec 30, 2019, 8:49 PM IST

రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో తెరాసకు ఓటేస్తే దొంగకు తాళం చెవి ఇచ్చినట్టేనని దుయ్యబట్టారు మల్కాజిగిరి ఎంపీ రేవంత్​రెడ్డి. మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు కూన శ్రీశైలం గౌడ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు కుంతియా, మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

రాష్ట్రంలో ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలు అందడం లేదని రేవంత్ మండిపడ్డారు. జవహర్ నగర్​ నుంచి డంపింగ్ యార్డ్​ను తరలించాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఎంపీ కోరారు. తెరాసకు ఓటు వేస్తే అవినీతికి తాళం ఇచ్చినట్టేనని వ్యాఖ్యానించారు. శాసనసభ ఎన్నికల్లో జరిగిన తప్పిదాన్ని మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి సరిచేయాలని రేవంత్ సూచించారు. సీఎం రాష్ట్ర అభివృద్ధి కోసం చేసిన ఖర్చంతా ఎవరి జేబుల్లోకి వెళ్లిందో చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పుట్టబోయే బిడ్డ మీద కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. లక్ష అప్పు పెట్టాడని ఆరోపించారు.

మున్సిపాలిటీ ఎన్నికలపై జవహర్​ నగర్​లో కాంగ్రెస్ సమావేశం

ఇవీ చూడండి: పాల ప్యాకెట్లు దొంగలిస్తూ... దొరికిపోయారు...!

Intro:మేడ్చల్ జిల్లా

జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కమలాదేవి గార్డెన్స్ లో జిల్లా కాంగ్రేస్ పార్టీ అధ్యకులు కూన శ్రీశైలం గౌడ్ ఆధ్వర్యంలో మేడ్చల్ నియోజకవర్గ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి,రాష్ట్ర ఇంచార్జ్ కుంతియా,మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.అనంతరం సమావేశంలో మేడ్చల్ మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు అనుముల రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలు అందడం లేదనీ,8లక్షల కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తుందనీ,ఆ 8లక్షల కోట్లు ప్రతీ పేద వాడికి తలా లక్ష రూపాయలు ఇచ్చినా మన బతుకులు మారుతుండే అని ఆ డబ్బు అంతా ఎవరి జోబులోకి వెళ్లిందో కేసీఆర్ చెప్పాలని అన్నారు.జవహర్ నగర్ అంటే రాష్ట్ర ప్రజలకు మురికి కుప్పగా గుర్తింపు ఉందనీ,హైదరాబాద్ లోని పరిసర ప్రాంతాల నుండి తీసుకు వచ్చిన చెత్తను జవహర్ నగర్ ప్రజల నేతిలో వేస్తున్నారని అన్నారు. జవహర్ నగర్ లో పేద ప్రజలు అధిక సంఖ్యలో ఉన్నారు. బతకడానికి వలస వచ్చి నివసించే ప్రజలు అధిక సంఖ్యలో ఉన్నారనీ దాదాపు నాలుగు వందల ఎకరాలలో ఏర్పాటు చేసిన ఈ డంపింగ్ యార్డ్ ను ఇక్కడ నుండి తరలించాలని, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి మొదలుపెట్టి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదు అని అన్నారు.ఈ ప్రాంత చెరువులో నీరు కలుషితం కాకుండా, భూగర్భ జలాలు కలుషితం కాకుండా, ఒక ఆరోగ్యవంతమైన పరిస్థితులు జీవించడానికి, అవసరమైన వసతులు చేయాకుండా చంద్రశేఖర రావు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓటు వేస్తే దొంగకు తాళం చెవి ఇచినట్టే అని దుయ్యబట్టారు.ఈ సమావేశంలో జిల్లా జడ్పీ ఫ్లోర్ లీడర్ హరివర్ధన్ రెడ్డి,జవహర్ నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బల్లి శ్రీనివాస్,యువజన నాయకుడు కుతాడి సాయి,వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రసాద్ గౌడ్,జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు,మహిళలు,అధిక సంఖ్యలో పాల్గొన్నారు.Body:VamshiConclusion:7032401099
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.