కూకట్పల్లి నియోజకవర్గంలో నేటికి లక్షా ఇరవై వేల కుటుంబాలకు బియ్యం, నిత్యావసర వస్తువులను పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పాత బోయిన్పల్లి డివిజన్లోని గంగపుత్ర సంఘం ప్రాంతంలో 1600 కుటుంబాలకు కార్పొరేటర్ నర్సింహా యాదవ్ ఆధ్వర్యంలో బియ్యం, పప్పు, నూనెలను పంపిణీ చేశారు.
లాక్డౌన్లో ప్రజలెవరూ ఆకలికి బాధపడకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పేద కుటుంబాలకు నిత్యావసరాలు, నగదు అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కిరాయి దారులను యజమానులు ఇబ్బందులు పెట్టొద్దని.. దశల వారీగా తీసుకోవాలని మాధవరం కోరారు. అలా కుదరదని ఇబ్బందులు పెడితే మాత్రం కేసులు పెట్టి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: వలస కూలీలను ఫోన్ నంబర్‌తో పట్టేస్తారు