నీరా, తాటికల్లు లాంటి సహజసిద్ధమైన వాటిని విడిచిపెట్టి ప్రకృతికి విరుద్ధంగా వెళ్లినప్పుడే కొత్త కొత్త జబ్బులు వస్తాయని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నీరాలో ఎన్నో ఔషధ గుణాలున్నాయని.. చిన్నపిల్లలకు కూడా తాపించొచ్చని తెలిపారు. మేడ్చల్ జిల్లా కొంపల్లిలో జీలుగు చెట్టు నుంచి నీరా తీసే కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు.
రాష్ట్రంలో త్వరలో నీరా, దాని ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మంత్రి తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి కూడా కృషి చేస్తున్నారని అన్నారు. నీరా పానీయంలో ఉండే పోషకాల గురించి శాస్త్రవేత్తలు మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ నీరా తాగారు. రాష్ట్రవ్యాప్తంగా ఈత మొక్కలను నాటనున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: కూల్చివేత ఎఫెక్ట్: ఆలయం, మసీదు దెబ్బతినటంపై సీఎం విచారం