ETV Bharat / state

శిశు సంక్షేమ శాఖకు మరిన్ని సంస్కరణలు: సత్యవతి రాఠోడ్

మేడ్చల్​-మల్కాజిగిరి జిల్లా కూకట్​పల్లిలోని మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయం రెస్క్యూ హోం​లో కోటి వృక్షార్చన కార్యక్రమం నిర్వహించారు. మంత్రి సత్యవతి రాఠోడ్ హాజరై​ మొక్కలు నాటారు.

Minister Satyavathi planted plants in Koti Vriksharchana
శిశు సంక్షేమ శాఖకు మరిన్ని సంస్కరణలు: సత్యవతి రాఠోడ్
author img

By

Published : Feb 17, 2021, 4:33 PM IST

శిశు సంక్షేమ శాఖకు మరిన్ని సంస్కరణలు చేసి.. మరింత సేవ చేసేందుకు కృషి చేస్తామని మంత్రి సత్యవతి రాఠోడ్​ పేర్కొన్నారు. సీఎం జన్మదినం సందర్భంగా చేపట్టిన కోటి వృక్షార్చనలో భాగంగా కూకట్​పల్లిలోని మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయం రెస్క్యూ హోం​లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా హోమ్​లోని మహిళలు నేర్చుకున్న వివిధ రకాల పనులను గురించి అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఆల్విన్ కాలనీలోని దుర్గాబాయి దేశ్​ముఖ్ మహిళా ప్రాంగణాన్ని సందర్శించారు. ప్రాంగణం అభివృద్ధికి నోచుకోక పోవడం పట్ల మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. రాబోవు రోజుల్లో ఈ మహిళా ప్రాంగణాన్ని అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కూకట్​పల్లి పరిసర ప్రాంతాల్లో నిరుద్యోగ యువతులు, మహిళలకు చేతి వృత్తులు, ఉపాధి అవకాశాల కల్పన నైపుణ్య శిక్షణ ఇవ్వాలని సూచించారు.
ఇవీచూడండి: వ్యవసాయక్షేత్రంలో మొక్క నాటిన సీఎం కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.