మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర మండలం నాగారం మున్సిపాలిటీలో రూ. యాభై లక్షలతో చేపట్టనున్న పనులకు మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు అన్నింటికి మరిన్ని ఎక్కువ నిధులు కేటాయించే అవకాశం ఉందని మంత్రి మల్లారెడ్డి అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు నగర శివారు ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. సీఎం రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి చైనాకు చెక్: లద్దాఖ్కు కొత్త రోడ్డు మార్గం