మేడ్చల్ జిల్లాలో జూన్ 20 నుంచి హరితహారం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు తెలిపారు. మున్సిపాలిటీలకు మండలానికి శాఖల వారీగా అధికారులు కేటాయించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటాలని ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో హరితహారంపై మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. మొక్కలు నాటేందుకు ప్రణాళిక తయారు చేసుకొని... గుంతలు తీసే ఎర్రమట్టి ఎరువును సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు తుర్కపల్లి నుంచి తూముకుంట వరకు జూన్ 2 నుంచి పెద్ద మొక్కలు నాటాలని అధికారులకు ఆదేశించారు.
ఇవీ చూడండి: రూపం మనోహరం... అభినయం అనితర సాధ్యం!