మానవ మనుగడకు దోహదపడే చెట్లను పెంచి భావితరాలకు స్వచ్ఛమైన ప్రకృతిని ప్రసాదించాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. జిల్లాలోని ఘట్కేసర్ మండలంలోని కాచవాని సింగారంలో ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా ఆయన మొక్కలు నాటారు.
కార్యక్రమంలో మండల ప్రజ పరిషత్ అధ్యక్షుడు సుదర్శన్‌రెడ్డి, ఎంపీడీవో అరుణ, సర్పంచ్ వెంకటరెడ్డిలు పాల్గొని మొక్కలు నాటారు. ప్రతి కుటుంబానికి కనీసం ఐదు మొక్కలైనా అందించాలని.. కుటుంబసభ్యులందరూ వాటి సంరక్షణ బాధ్యతను తీసుకోవాలని కలెక్టర్ కోరారు.