మేడ్చల్ జిల్లా పూడూరులో గుట్టు చప్పుడు కాకుండా బాల్య వివాహం నిర్ణయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూడూర్ గ్రామానికి చెందిన బాలికను రావల్‌కోల్ గ్రామానికి చెందిన వ్యక్తితో శుక్రవారం నాచారం ఆలయం వద్ద పెళ్లి జరిపించాలని ఏర్పాట్లు చేసుకోగా స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి వెళ్లిన షీ టీం, సీడబ్ల్యూసీ, ఐసీడీఎస్ అధికారులు విచారణ చేపట్టారు.
బాలికను... తల్లి అక్రమంగా దత్తత తీసుకున్నట్లు తెలిసింది. ఈ ఘటనలో పెళ్లి కొడుకు తల్లి తండ్రులు, బాలిక తల్లిదండ్రులపై కేసు నమోదు చేయాలని ఐసీడీఎస్ బీఆర్బీ అధికారి ప్రియాంక తెలిపారు. వారంలో మేడ్చల్ మండలంలో ఇది రెండో బాల్య వివాహం కావడం గమనార్హం.
ఇదీ చదవండి:సమ్మె విరమించిన గాంధీ జూడాలు