హైదరాబాద్‌ను రెండవ రాజధాని చెయ్యాలి: రేవంత్ ప్రస్తుతం తెలంగాణాలో దొరల పాలన నడుస్తోందని మల్కాజిగిరి లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ప్రశ్నించే నాయకుడు లేడని... ప్రశ్నించే వారిని కేసీఆర్ అనేక రకాలుగా ఒత్తిడి తెచ్చి తెరాసలో కలుపుకుంటున్నారని మండిపడ్డారు. తాను గెలిస్తే మల్కాజిగిరిలో ఉన్న ప్రజా సమస్యలన్నింటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మల్కాజిగిరి ఒక మినీ ఇండియా అని... హైదరాబాద్‌ను దేశానికి రెండవ రాజధానిగా చెయ్యాలని సూచించారు. తాను గెలిస్తే పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు పెట్టి దీనిపై పోరాడతానని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి:'కూటమి లేకున్నా.. ఒకేతాటిపై ఉన్నాం'