మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధి చెక్ పోస్టు సమీపంలోని ఓ వెంచర్లో ఆదివారం రాత్రి ఓ వ్యక్తిపై దాడి చేసిన ఘటన కలకలం రేపింది. మేడ్చల్ పట్టణానికి చెందిన దిలీప్(26)పై తన స్నేహితుడు శంకర్ పాత కక్షలతో ఫోన్ చేసి ఓ ప్రాంతానికి రమ్మని ఆపై కత్తితో దాడి చేశాడు.
ఈ ఘటనలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని, మెరుగైన చికిత్స కోసం కొంపల్లిలోని ఆస్పత్రికి తరలించారు. ఎందుకు దాడి చేశాడనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు మేడ్చల్ సీఐ ప్రవీణ్ రెడ్డి తెలిపారు.
ఇదీ చూడండి : ముఖ్యమంత్రి పుట్టినరోజుకు మొక్కలు నాటండి: కేటీఆర్