Etela: ప్రభుత్వాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారు: ఈటల - ఈటల రాజేందర్ వార్తలు
రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారని మాజీ మంత్రి ఈటల రాజేందర్(Etela) అన్నారు. ఆత్మగౌరవం కోసం తెలంగాణలో మరో ఉద్యమం ప్రారంభమైందని తెలిపారు. మేడ్చల్ జిల్లా భాజపా కార్యకర్తలతో షామీర్‌పేట్‌లోని తన నివాసంలో సమావేశమయ్యారు.
ఆత్మగౌరవం కోసం తెలంగాణలో మరో ఉద్యమం ప్రారంభమైందని తెలిపారు. ఈ ప్రభుత్వం కొనసాగితే తెలంగాణ ప్రజలకు అరిష్టమని... ఈ ప్రభుత్వాన్ని దించే వరకు నిద్రపోవద్దని సమాజమంతా అనుకుంటుందని ఈటల పేర్కొన్నారు. హస్తినలో భాజపాలో చేరిన తరువాత ఇవాళ షామీర్పేటలోని తన నివాసంలో ఈటల(Etela) మేడ్చల్ జిల్లా భాజపా కార్యకర్తలతో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు.
రేపు హుజురాబాద్‌కు ఈటల
తన ఇల్లు మేడ్చల్‌లోనే ఉందని మీ అందరికి అందుబాటులో ఉంటానని చెప్పారు. తెలంగాణ కోసం సుష్మాస్వరాజ్, విద్యాసాగర్‌రావుతో అనేక సమావేశాల్లో పాల్గొన్నానని గుర్తు చేశారు. ప్రజల ఆశీర్వాదం ఉంటేనే రాజకీయ నాయకునికి బతుకు ఉంటుందన్నారు. హుజూరాబాద్ ఎన్నిక తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా అభివర్ణించారు. 2024లో తెలంగాణలో కాషాయం జెండా ఎగురుతుందని ఈటల తెలిపారు. ఈ సమావేశంలో మేడ్చల్ జిల్లా భాజపా అధ్యక్షుడు పన్నాల హరిచంద్ర రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈటల రేపు హుజురాబాద్ వెళ్లనున్నారు.
ఇదీ చదవండి: తెలంగాణలో కొత్తగా 1,489 కరోనా కేసులు, 11 మరణాలు