మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ జీహెచ్ఎంసీ పరిధిలోని చర్లపల్లి డివిజన్ గణేశ్ నగర్ కాలనీలో వరద బాధితులకు అందాల్సిన పదివేల రూపాయలు అందకుండా కాలనీ అధ్యక్షుడు మర్రి దయాకర్ రెడ్డి ఐదు వేల రూపాయలు బాధితులకు అందజేసి మరో 5 వేల రూపాయలను నొక్కేస్తున్నాడంటూ సుమారు రెండు వందల మంది కాలనీ వాసులు మర్రి దయాకర్ రెడ్డి ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు.
తాము కష్టాల్లో ఉంటే ప్రభుత్వం ఇచ్చే సాయాన్ని కూడా కాలనీ అధ్యక్షుడు తన ఖాతాలో జమచేసుకోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. దానితో వారు నేరుగా మేయర్‌కు ఫిర్యాదు చేశారు. దానితో రంగంలోకి దిగిన మేయర్ కాలనీలో జరిగిన తప్పులను మేయర్ బొంతు రామ్మోహన్ సరిదిద్దారు. వరద బాధితులకు 10 వేల రూపాయలు పరిహారం అందిస్తుంటే మరోవైపు కాలనీ అధ్యక్షుడు పేరిట చలామణి అవుతూ వరద బాధితులకు సహాయం అందించే సగం డబ్బు తన ఖాతాలో జమచేసుకున్న దయాకర్ రెడ్డిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
పేదలు ఇల్లు కట్టుకుంటే కూడా వారి దగ్గర ముందుగానే డబ్బులు వసూలు చేస్తున్నాడని ఇవ్వకుంటే రెవెన్యూ అధికారులకు చెప్పి మీ ఇల్లు కూల్చివేస్తానని బెదిరిస్తున్నాడుని స్థానికులు ఆరోపించారు. గతంలో దయాకర్ రెడ్డిపై కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో భూకబ్జా కేసు కూడా నమోదైంది తెలిపారు.
ఇదీ చూడండి: పారిశుద్ధ్య కార్మికుల సేవలకు గుర్తుగా వేతనాల పెంపు: మంత్రి తలసాని