మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారంలో విషాదం చోటుచేసుకుంది. బాలయ్య నగర్‌లోని క్వారీ నీటి గుంతలో పడి ముగ్గురు మృతి చెందారు. మృతులు ఐలమ్మ (65), అనిత (30), యశ్వంత్ (10)లు కర్ణాటకలోని యాద్గిర్ జిల్లా వాసులుగా గుర్తించారు. బాధితులు బాలయ్యనగర్‌లోని బంధువుల వివాహానికి వచ్చారు. బట్టలు ఉతుకుతుండగా దురదృష్టవశాత్తు క్వారీ నీటి గుంతలో పడి చనిపోయారు.
ఇవీ చూడండి: 'తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ శుభ పరిణామం'