మెదక్ జిల్లా రామాయంపేట వాసులు తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారు. ప్రధాన రహదారికి ఇరువైపులా డ్రమ్ములు పెట్టారు. వాటిలోకి ట్యాంకర్ల ద్వారా నీటిని నాలుగు రోజులకు ఒకసారి సరఫరా చేస్తున్నారు. అవి సరిపోవడం లేదని నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటికోసం పనులు మానుకుని ఎదురు చూడాల్సిన దుస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయానికి పలుమార్లు వెళ్లినప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండిముగిసిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం