మెదక్ జిల్లా నర్సాపూర్ మండల పరిధిలోని రెడ్డిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర పరిశీలకులు కలిమోద్దీన్ సందర్శించారు. కొవిడ్-19 ప్రబలుతున్న తరుణంగా జిల్లాలో ఎలాంటి వైద్య సేవలందిస్తున్నారో ఆరా తీశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రికార్డులను పరిశీలించారు.
కరోనా సోకిందనే అనుమానంతో వచ్చిన వారికి పరీక్షలు జరిపి తగిన సూచనలు చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. రాష్ట్ర పరిశీలకుడు కలిమోద్దీన్ వెంట జిల్లా ఉపవైద్యాధికారి విజయనిర్మల, వైద్యాధికారి ప్రియదర్శిని, సుగుణాకర్, లక్ష్మీమంగ ఉన్నారు.
- ఇదీ చదవండి: 'బంగాలీ ఆత్మగౌరవం' దీదీని గెలిపించేనా?