మెదక్ జిల్లా కేంద్రంలో సాయంత్రం కురిసిన కొద్దిపాటి వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. స్థానిక రాందాస్ చౌరస్తాలో వర్షపు నీటితో పాటు మురుగునీరు రోడ్డుపైకి చేరి చిన్నపాటి చెరువులను తలపించాయి. దీంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
చిన్నపాటి వర్షానికే మురుగు నీరు రోడ్డుపైకి రావడంపై ప్రజా ప్రతినిధులు, ఉన్నత అధికారులు దృష్టి సారించాలని పట్టణ వాసులు కోరుతున్నారు.
ఇవీ చూడండి: కారులో అగ్నిప్రమాదం... క్షణాల్లో దగ్ధం