రెండో ఆదివారం వచ్చిందంటే చాలు మెదక్‌లోని గురుకుల పాఠాశాలలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తమ పిల్లలను చూసేందుకు తల్లిదండ్రుల రాకతో సందడిగా మారుతుంది. తల్లిదండ్రులు, బంధువులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ల రాకతో విద్యార్థులు ఇంటికి వెళ్లినంత ఆనందం పొందుతారు. వారు తెచ్చిన వంటకాలను కడుపునిండా ఆరగిస్తారు. అమ్మానాన్న చెప్పే కబుర్లు వింటూ.. సరదాగా గడుపుతారు. ఇలా ప్రతి నెలలో రెండో ఆదివారం వస్తే గురుకుల పాఠశాల ప్రాంగణమంతా విహార స్థలాన్ని తలపిస్తుంటుంది.
తల్లిదండ్రులు ఉదయాన్నే లేచి... పిల్లల కోసం తమకు ఇష్టమైన వంటకాలను తీసుకువచ్చి... సాయంత్రం వరకు వారితో గడుపుతారు. వారి సమస్యల గురించి, చదువు గురించి అడిగి తెలుసుకుంటారు. ఈ ఒక్క ఆదివారం కోసం... విద్యార్థులు నెలరోజులు ఎదురుచూస్తారనడంలో అతిశయోక్తి లేదు.
దసరా, సంక్రాంతి పండగ సమయాల్లో లేదా అనారోగ్యానికి గురైతే తప్ప విద్యార్థులు ఇళ్లకు పంపేందుకు అవకాశం ఉండదు. వచ్చిన ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు, విద్యార్థులు ఇలా సద్వినియోగం చేసుకుంటూ... ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి: హారన్ వేశారో... ఆగి తీరాల్సిందే