ETV Bharat / state

police help: పోలీసుల మానవత్వం.. గర్భిణీకి సాయం

లాక్​డౌన్​(Lock down) సమయంలో పోలీసులు విధులతోపాటు సేవలు కూడా చేసి ప్రజల మెప్పు పొందుతున్నారు. తాజాగా మెదక్​ జిల్లాలో ఓ గర్భిణీ పట్ల పోలీసులు మానవత్వం జూపి.. రోడ్డుపై ఇబ్బంది పడుతున్న వారిని తమ వాహనంలో(police help) ఇంటికి పంపించారు. ఈ సంఘటనపై స్థానికుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

police help at medak district
police help: పోలీసుల మానవత్వం.. గర్భిణీకి సాయం
author img

By

Published : Jun 5, 2021, 7:20 PM IST

అసలే లాక్​డౌన్​(Lock down) సమయం, పైగా ఎండాకాలం. ఈ పరిస్థితుల్లో రవాణా సౌకర్యం అందక ఇబ్బంది పడుతున్న ఓ నిండు గర్భిణీ పట్ల పోలీసులు మానవత్వం చూపించారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట పోలీసులు తమ వాహనంలో ఇంటికి(police help) సాగనంపారు.

శనివారం చేగుంట మండలం కర్నాల్​పల్లికి చెందిన గ్యాదరి మనీశ తొమ్మిది నెలల గర్భిణీ కావడం వల్ల… తన అత్తగారితో కలిసి మెదక్ పట్టణానికి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం కోసం వెళ్లారు. తిరుగు ప్రయాణంలో లాక్​డౌన్ సడలింపు కారణంగా ఓ ఆటోవాలా.. మధ్యాహ్నం రెండు గంటలు కావడం వల్ల చిన్నశంకరంపేట పట్టణంలో వారిని వదిలి వెళ్లిపోయాడు.

ఆ సమయంలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులను వారు సంప్రదించారు. వారి పరిస్థితిని చూసి చలించిన ఎస్సై మహమ్మద్ గౌస్ పోలీసు వాహనంలో వారిని ఇంటికి తరలించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ తరుణంలో పోలీసుల చర్య పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

ఇదీ చూడండి: TS News: రాష్ట్రవ్యాప్తంగా ఆగిన రిజిస్ట్రేష‌న్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.