ETV Bharat / state

40 ఏళ్ల వ్యక్తితో బాలిక వివాహానికి ఏర్పాట్లు.. అడ్డుకున్న అధికారులు - తెలంగాణ వార్తలు

మెదక్​ జిల్లా నర్సాపూర్​ మండలం కోక్యాతండాలో బాల్య వివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. పదో తరగతి పూర్తైన బాలికను 40 ఏళ్ల వ్యక్తికి ఇచ్చి వివాహం చేసేందుకు ఏర్పాట్లు చేయగా... అధికారులు అక్కడికి వచ్చి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్​ ఇచ్చి పెళ్లి ఆపేశారు.

officers stopped child marriage in kokyathanda medak district
http://10.10.50.85//telangana/13-February-2021/tg_srd_23_13_balya_vivaham_addaginta_ts10100_1302digital_1613227026_236.jpg
author img

By

Published : Feb 13, 2021, 8:40 PM IST

పదో తరగతి పూర్తైన బాలికను 40 ఏళ్ల వ్యక్తికి ఇచ్చి... రెండో పెళ్లి చేయడానికి ఏర్పాట్లు చేశారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో వచ్చిన అధికారులు పెళ్లిని అడ్డుకున్నారు. ఈ ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్​ మండలం కోక్యాతండాలో చోటుచేసుకుంది.

డిప్యూటీ తహసీల్దార్ తిరుమలరావు, సీడీపీవో హేమ భార్గవి, సూపర్​వైజర్ అంజమ్మ, పోలీసులు అక్కడికి చేరుకొని బాలిక తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. వివాహ వయస్సు వచ్చే వరకు పెళ్లి చేయొద్దని నచ్చజెప్పారు. అనంతరం బాలికను కస్తూర్బా కళాశాలలో చేర్పించారు. కట్నంగా ఇచ్చిన డబ్బులను తిరిగి ఇప్పించారు.

ఇదీ చూడండి: కిడ్నాప్​ నాటకమాడిన వివాహిత.. ఛేదించిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.