కాళేశ్వరం ప్రాజెక్ట్ నీటితో మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ రైతులకు తాగు, సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. శివ్వంపేట సహకార సంఘంలో రైతులకు రుణ మాఫీ చెక్కులు పంపిణీ చేశారు. గ్రామాల్లోని రైతుల పంటపొలాలను సస్యశ్యామలం చేయడానికి కృషి చేస్తున్నామని చెప్పారు.
మరిన్ని అభివృద్ధి పథకాలు తీసుకువచ్చి గ్రామాలను అభివృద్ధి చేస్తామన్నారు. 154 మందికి రూ.28 లక్షల రుణమాఫీ అయ్యిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం ఛైర్మన్ వెంకట్రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇవీచూడండి: భారత్ బయోటెక్ ల్యాబ్‌ను సందర్శించిన మంత్రి కేటీఆర్