దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయన్నారు మంత్రి హరీశ్‌రావు. రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, అన్నదాతలకు ఉచిత కరెంట్ వంటి గొప్ప పథకాలు.. భాజపా అధికారంలో ఉన్న 17 రాష్ట్రాల్లో లేవని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం యావద్దేశం మెచ్చేలా పనిచేస్తోందన్నారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో పర్యటించి పలు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.
మెదక్ జిల్లా పెద్ద శంకరంపేటలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను, రైతువేదిక భవనాలను ప్రారంభించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎందరో ముఖ్యమంత్రులను చూశామని.. రైతుల క్షేమం గురించి ఆలోచించే ఏకైక సీఎం కేసీఆరే అంటూ కొనియాడారు. నూతన సంవత్సరం కానుకగా వచ్చే సోమవారం నుంచి అన్నదాతల ఖాతాల్లో రైతుబంధు డబ్బును జమ చేస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: 'ఇంత గొప్ప సంక్షేమ పథకాలు ఇంకెక్కడా లేవు'