ETV Bharat / state

మాస్క్​ లేకుండా బయటకు వస్తే జరిమానా తప్పదు: మెదక్​ ఎస్పీ - కరోనా వైరస్​ వార్తలు

మెదక్​ జిల్లాలో ప్రతి ఒక్కరు లాక్​డౌన్​ నిబంధనలను పాటించాలని జిల్లా ఎస్పీ చందనదీప్తి సూచించారు. అందరూ విధిగా మాస్క్​ ధరించాలని, మాస్క్​ లేకుండా బయటకు వస్తే 1000 రూపాయలు జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

medak sp chandana deepti spoke about lockdown rules
మాస్క్​ లేకుండా బయటకు వస్తే జరిమానా తప్పదు: మెదక్​ ఎస్పీ
author img

By

Published : May 8, 2020, 7:37 PM IST

ఇండ్లలో నుంచి పనుల కోసం బయటకు వచ్చేవారు విధిగా మాస్క్ ధరించాలని, మాస్క్ లేకుండా బయటకు వస్తే 1000 రూపాయలు జరిమానా విధిస్తామని మెదక్ ఎస్పీ చందనదీప్తి తెలిపారు. దీన్ని గుర్తించి ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని... లేని యెడల మాస్క్ పెట్టుకోని వ్యక్తులు ఎవరైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. జిల్లాలో ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి, వేరే జిల్లాల నుంచి అనుమతి ఉన్న వ్యక్తులు మాత్రమే రావాలని సూచించారు. ఇష్టం వచ్చినట్లు వస్తే చట్టప్రకారం వాహనాలు జప్తు చేసి లాక్​డౌన్ ఉల్లంఘన కింద సదరు వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్డు మీద, జన సంచార ప్రదేశాలలో ఉమ్మి వేసినట్లయితే కేసు నమోదు చేస్తామని అన్నారు.

సాయంత్రం ఆరు గంటల తర్వాత తెరిచి ఉంచిన షాపుల ఫోటోలు తీసి కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఇప్పటివరకు మెదక్ జిల్లా ప్రజలు పూర్తి స్థాయిలో లాక్​డౌన్​కు సహకరించడం వల్ల జిల్లాలో కరోనా నియంత్రణలో ఉందని వెల్లడించారు. ఇదే స్ఫూర్తితో భౌతిక దూరం పాటిస్తూ... ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని సూచించారు. లాక్​డౌన్​ నిబంధనలను ఎవరు ఉల్లంఘించినా కఠిన చర్యలు చేపడతామని మెదక్​ జిల్లా ఎస్పీ హెచ్చరించారు.

ఇవీ చూడండి: మందుబాబులను చితకబాదిన మహిళ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.