తపన ఉంటే ఎవరైనా అనుకున్నది సాధించవచ్చు. చూపు లేకున్నా చదువులో ముందంజలో ఉండి అందరికీ ఆదర్శంగా నిలిచింది పల్లవి. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణానికి చెందిన పల్లవి ఇంటర్మీడియట్‌లో 91 శాతంతో ఉత్తీర్ణత సాధించింది. తల్లిదండ్రులు దినసరి చిరువ్యాపారులు. పేదరికంలో మగ్గినా... తన చదువును ఏనాడు నిర్లక్ష్యం చేయలేదు.
మున్సిపల్ ఛైర్మన్ అభినందన
చెన్నైలోని సత్యభామ యూనివర్సిటీలో అర్హత సాధించింది. ఈవిషయం తెలుసుకున్న నర్సాపూర్ మున్సిపల్ ఛైర్మన్ మురళి యాదవ్... పల్లవికి అజయ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ల్యాప్ ట్యాప్ అందించారు. ఉన్నత చదువులు చదవాలని సూచించారు. భవిష్యత్లో తనవంతు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. మున్సిపల్ ఛైర్మన్ మానవత్వం చాటుకున్నారని తల్లిదండ్రులు అన్నారు. పట్టుదల, కృషితో పల్లవి ఇంతటి ఘనత సాధించిందని కొనియాడారు.
ఇదీ చదవండి: 19 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం