గన్నీ బ్యాగుల కొరత, ఐకేపీ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా తాము పండించిన ధాన్యం రెండు నెలలుగా కొనుగోలు కేంద్రాల్లోనే ఉందని మెదక్ జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రెండు రోజులుగా కురుస్తోన్న వర్షాలకు ధాన్యం తడిసి ముద్దయిందని తమ గోడు వెల్లబోసుకున్నారు.
సరైన సమయంలో పంటను కొనుగోలు చేయకపోవడం కారణంగా టార్పాలిన్ల కిరాయి భారం కూడా తమపైనే పడుతోందని మెదక్ జిల్లా రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అవుసులపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా రెండు నెలల నుంచి పంటను కొనుగోలు చేయడంలేదని తెలిపారు. వర్షం కారణంగా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరీశ్ తక్షణమే స్పందించి ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చూడాలని వేడుకున్నారు.
ఇదీ చదవండి: Suicide attempt: మేడ పైనుంచి దూకబోయిన కరోనా రోగి..