ETV Bharat / offbeat

వింటర్​ స్పెషల్​ - యమ్మీ యమ్మీ "చికెన్​ సమోసా" - ఈవెనింగ్​ టైమ్​ పర్ఫెక్ట్​ స్నాక్​ - టేస్ట్​ అదుర్స్​! - HOW TO MAKE CHICKEN SAMOSA AT HOME

-రెగ్యులర్​ సమోసా తిని బోర్​ కొడితే ఓసారి ఇది ట్రై చేయండి -టమాట కెచప్​ లేదంటే పుదీనా చట్నీతో సర్వ్ చేసుకుంటే టేస్ట్​ అదుర్స్​

Chicken Samosa
How to Make Chicken Samosa at Home (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 27, 2024, 10:27 AM IST

How to Make Chicken Samosa at Home: ఎక్కువ మంది ఇష్టంగా తినే స్ట్రీట్ ఫుడ్స్​లో సమోసా ఒకటి. వాతావరణం కూల్​గా ఉన్నప్పుడు.. సాయంత్రం సమయంలో.. సమోసా విత్​ గరం చాయ్​ కాంబినేషన్​ కిర్రాక్​ ఉంటుంది. కాగా సమోసా అంటే ఆనియన్​ సమోసా, ఆలు సమోసా, కార్న్​ సమోసా మాత్రమే తిని ఉంటారు. ఇంట్లో కూడా వీటిని మాత్రమే చేస్తుంటారు. అయితే ఎప్పుడూ అవే తింటే బోర్​ కోడుతుంది. కాబట్టి ఈసారికి సూపర్ టేస్టీగా ఉండే చికెన్​ సమోసా తయారు చేసుకోండి. టేస్ట్​ అద్భుతంగా ఉంటుంది. చికెన్​ను ఇష్టపడేవారు వీటిని ఇంకా ఇష్టంగా తింటారు. మరి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో చూద్దాం..

కావాల్సిన పదార్థాలు:

  • మైదా పిండి - ఒకటిన్నర కప్పులు
  • ఉప్పు - అర టీ స్పూన్​
  • వాము - అర టీ స్పూన్​
  • నెయ్యి - 3 టీ స్పూన్లు
  • నూనె - 3 టీ స్పూన్లు
  • ఉల్లిపాయలు - 2
  • పచ్చిమిర్చి - 2
  • అల్లం వెల్లుల్లి పేస్ట్​ - అర టీ స్పూన్​
  • చికెన్​ కీమా - 200 గ్రాములు
  • పసుపు - పావు టీ స్పూన్​
  • కారం - ఒకటిన్నర టీ స్పూన్లు
  • ధనియాల పొడి - అర టీ స్పూన్​
  • గరం మసాలా - అర టీ స్పూన్​
  • ఉప్పు - రుచికి సరిపడా
  • జీలకర్ర పొడి - అర టీ స్పూన్​
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
  • నూనె - డీప్​ ఫ్రై కి సరిపడా

తయారీ విధానం:

  • ముందుగా పిండి ముద్దను ప్రిపేర్​ చేసుకోవాలి. అందుకోసం ఒక గిన్నెలో మైదాపిండి తీసుకోవాలి. అందులోకి ముప్పావు టీ స్పూన్​ ఉప్పు, వాము, నెయ్యి వేసి కలపాలి. ఆ తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ముద్దలాగా చేసి దానిపైన కాస్త ఆయిల్​ రాసి మూత పెట్టి పక్కన పెట్టాలి.
  • ఇప్పుడు చికెన్​ ఫిల్లింగ్​ కోసం స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి నూనె పోసుకోవాలి. ఆయిల్​ హీట్​ అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఉల్లిపాయలు రంగు మారేంతవరకు ఫ్రై చేయాలి.
  • ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్​ వేసి పచ్చి వాసన పోయేవరకు మగ్గించుకోవాలి.
  • అల్లం పచ్చివాసన పోయిన తర్వాత చికెన్​ కీమా వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి.
  • అనంతరం పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర పొడి వేడి కలిపి కొత్తిమీర తరుగు వేసి స్టవ్​ ఆఫ్​ చేయాలి.
  • చికెన్ మిశ్రమం చల్లారని తర్వాత మిక్సీ జార్​లోకి వేసుకుని కచ్చాపచ్చాగా గ్రైండ్​ చేసుకోవాలి. అనంతరం దాన్ని ఓ బౌల్​లోకి తీసుకుని పక్కన పెట్టాలి.
  • ఇప్పుడు మైదా పిండి మిశ్రమాన్ని మరోమారు కలిపి నిమ్మకాయ సైజ్​లో ఉండలుగా చేసుకోవాలి. అందులో ఒక ఉండను తీసుకుని చపాతీ పీట మీద పొడి పిండి చల్లుకుంటూ చపాతీలుగా చేసుకోవాలి.
  • ఆ చపాతీలను మూడు ఇంచుల వెడల్పు, తొమ్మిది ఇంచుల పొడవు వచ్చే విధంగా స్కేల్ సహాయంతో కట్​ చేసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని సమోసా షీట్స్​ మాదిరిగా చేసుకోవాలి.
  • ఇప్పుడు సమోసా షీట్స్ సీల్ చేయడం కోసం.. ఒక చిన్న గిన్నెలో కొద్దిగా మైదా తీసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని చిక్కని పేస్ట్​గా ప్రిపేర్ చేసుకోవాలి.
  • తర్వాత ఒక సమోసా షీట్​ను చేతిలోకి తీసుకొని ట్రై యాంగిల్ వచ్చేలా మలుచుకోవాలి. తర్వాత మళ్లీ ఇంకో మడత పెట్టుకోండి. ఇప్పుడు కోన్ మాదిరిగా తయారవుతుంది.
  • అప్పుడు అందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్​ ఫిల్లింగ్​ను కొద్దిగా ఉంచి అన్ని చివరలకు మైదా పేస్ట్ అప్లై చేసి క్లోజ్ చేసుకోవాలి. ఇలా మొత్తం షీట్స్ అయిపోయేంత వరకు సమోసాలు ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్​లో ఉంచుకోవాలి. ఇలా షీట్స్​ ఇంట్లో ప్రిపేర్​ చేసుకోవడం కష్టమనుకుంటే మార్కెట్లో ఇవి లభిస్తాయి.
  • తర్వాత స్టౌపై కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనె పోసుకోవాలి. నూనె వేడయ్యాక సమోసాలను నూనెలో వేసి మంటను మీడియం ఫ్లేమ్​లో ఉంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి.
  • ఆపై వాటిని ప్లేట్​లోకి తీసుకుని సర్వ్​ చేసుకుంటే సరి. ఎంతో.. క్రంచీగా, ఎంతో క్రిస్పీగా నోరూరించే " చికెన్​​ సమోసాలు" రెడీ. వీటిని టమాట కెచప్​ లేదంటే పుదీనా చట్నీతో సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటాయి.

ఎప్పుడూ ఆనియన్​ సమోసా ఏం బాగుంటుంది - ఓసారి "ఎగ్​ సమోసా" ట్రై చేయండి - టేస్ట్​ అద్దిరిపోతుంది!

ఇంట్లోనే ఈజీగా "మీఠా సమోసా" - టేస్ట్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

హమారా హైద్రాబాద్.. ఈ స్ట్రీట్​ ఫుడ్స్ ఒక్కసారైనా ట్రై చేయాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.