ETV Bharat / sports

ఐపీఎల్​ 2025 - ఓవర్​నైట్​లో కోటీశ్వరులైన యంగ్ ప్లేయర్స్ వీరే

వేలంలో అనూహ్యమైన ధర దక్కించుకున్న పెద్దగా పేరు లేని కొంతమంది యంగ్ ప్లేయర్స్ వీరే.

IPL 2025 Mega Auction Young Players Most Valuable
IPL 2025 Mega Auction Young Players Most Valuable (source ETV Bharat)
author img

By ETV Bharat Sports Team

Published : 3 hours ago

IPL 2025 Mega Auction Young Players Most Valuable : ఐపీఎల్‌ వేలంలో క్రికెట్ అభిమానుల అందరి కళ్లూ స్టార్‌ ప్లేయర్స్​పైనే ఉంటాయి. వీరంతా ఎంత ధర పలుకుతారా అనే చూస్తారు. అయితే ఈ సారి పంత్, శ్రేయస్, అర్ష్‌దీప్‌ లాంటి ప్లేయర్స్​ ఎక్కువ ధర పలికి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇదే సమయంలో పెద్దగా పేరు లేని కొంతమంది యంగ్ ప్లేయర్స్​ వేలంలో ఊహించని ధర దక్కించుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. మరి ఇంతకు వారెవరో ఈ కథనంలో తెలుసుకుందాం.

మరో మలింగ - ఐపీఎల్‌ ఆల్‌ టైం గ్రేట్‌ బౌలర్లలో ఒకడు లసిత్‌ మలింగ. ఇప్పుడు అదే పేరుతో, మరో టాలెంట్​ పేసర్‌ లంక క్రికెట్​లో ఎంట్రీ ఇచ్చాడు. అతడి పేరే ఇషాన్‌ మలింగ. శ్రీలంక జట్టులో నిలకడగా రాణించాడు. ఆసియా కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఒకడిగానూ నిలిచాడు. ఇంకా అంతర్జాతీయ అరంగేట్రం చేయలదు. ఇతడిని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రూ.1.2 కోట్లు వెచ్చించి దక్కించుకుంది.

సిక్సర్ల ఆర్య - రీసెంట్​గా దిల్లీ ప్రిమియర్‌ లీగ్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాది తన పేరు మార్మోగేలా చేశాడు ప్రియాంశ్‌ ఆర్య. ఇదే లీగ్‌లోని మరి కొన్ని మ్యాచ్‌ల్లోనూ అద్భుతంగా రాణించాడు. దీంతో ఈ హార్డ్‌ హిట్టర్​ కోసం పోటీ నెలకొనగా, పంజాబ్‌ కింగ్స్‌ రూ.3.8 కోట్లకు దక్కించుకుంది.

రషీద్​లా మరో మిస్టరీ స్పిన్నర్‌ - అఫ్గానిస్థాన్‌ స్పిన్నర్‌ అల్లా గజన్‌ఫర్‌ వయసు కేవలం 18 ఏళ్లే. రీసెంట్​గానే ఇంటర్నేషనల్ క్రికెట్​లోకి అడుగుపెట్టిన ఇతడు, ఐపీఎల్‌ వేలంలో మొదటి సారి తన పేరును నమోదు చేసుకున్నాడు. అయినా కూడా రూ.4.8 కోట్లతో అమ్ముడుపోయి అందరినీ షాక్​కు గురి చేశాడు.

ఇతడు రీసెంట్​గా బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో 6 వికెట్ల తీసి అదరగొట్టాడు. దీంతో వేలంలో అతడి కోసం గట్టి పోటీ నెలకొంది. చివరికి ముంబయి ఇండియన్స్‌ దక్కించుకుంది.

చెన్నై 'గుర్జన్ సింగ్'​ - ఇతడు చెన్నైలో ఉంటూనే తమిళనాడు జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ పొడగరి ఫాస్ట్‌ బౌలర్‌ దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తూ ఆకట్టుకుంటున్నాడు. తమిళనాడు ప్రిమియర్‌ లీగ్‌లో దిండిగల్‌ జట్టు ఈ సీజన్​ కప్పును ముద్దాడదంలో గుర్జన్‌ కీలకంగా వ్యవహరించాడు. మంచి వేగంతో బంతులు సంధించగల ఈ ఎడమచేతి వాటం పేసర్​ను చెన్నై సూపర్‌ కింగ్సే రూ.2.2 కోట్లకు కొనుగోలు చేసింది.

అశుతోష్​ పంజాబ్ టు దిల్లీ - ఈ సీజన్​ చివర్లో పంజాబ్‌ కింగ్స్‌ కొన్ని విజయాలు సాధించడంలో శశాంక్‌ సింగ్‌తో పాటు అశుతోష్‌ శర్మ కీలకంగా వ్యవహరించారు. 11 మ్యాచ్‌ల్లో 167 స్ట్రైక్‌ రేట్‌తో 189 పరుగులు చేశాడు. దీంతో వేలంలో అశుతోష్‌ను రూ.3.8 కోట్లకు దిల్లీ కొనుగోలు చేసింది.

పేస్‌ మెరుపు రసిక్‌ సలాం - ఇతడు 18 ఏళ్ల ఈ కుర్రాడు. వర్ధమాన ఆటగాళ్ల ఆసియా కప్‌లో అదరగొట్టాడు. భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు తీశాడు. అయితే వయసు ధ్రువపత్రంలో తప్పిదం కారణంగా 2019లో రసిక్‌పై రెండేళ్ల నిషేధం విధించారు. ఇప్పుడు పునరాగమనంలో మంచిగా రాణిస్తూ ఈ ఏడాది వేలంలో ఏకంగా రూ.6 కోట్లకు ఆర్సీబీకి అమ్ముడుపోయాడు. ఇప్పుడు అతడు టీమ్‌ఇండియాకు ప్రాతినిధ్యం వహించే దిశగా అడుగులేస్తున్నాడు.

వేలంలో అమ్ముడైన తెలుగు కుర్రాళ్లు వీరే - వాళ్ల గత రికార్డులు ఎలా ఉన్నాయంటే?

13 ఏళ్ల వైభవ్‌ ఐపీఎల్‌ ఆడొచ్చా? - రూల్స్ ఏం చెబుతున్నాయంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.