క్రిస్మస్ వేడుకలకు మెదక్ చర్చి ముస్తాబైంది. రంగురంగుల విద్యుద్దీపాలతో చర్చి ప్రాంగణం కాంతులీనుతోంది. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని బుధవారం ఉదయం నాలుగు గంటలకు బిషప్ రైట్ రెవరెండ్ సాల్మన్ రాజ్ దైవసందేశంతో మొదటి ఆరాధన ప్రారంభం కానుంది.
ఉదయం 9 గంటలకు రెండో ఆరాధన, మధ్యాహ్నం 2 గంటలకు మూడో ఆరాధన జరగనుంది. సాయంత్రం 5 గంటలకు మత గురువులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు .
క్రిస్మస్ వేడుకలకు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు తరలిరానున్నారు. భక్తుల సౌకర్యార్థం చర్చి నిర్వాహకులు వసతిగృహాలతోపాటు తాగునీరు, పారిశుద్ధ్యం, ప్రత్యేక పార్కింగ్ వసతులు ఏర్పాటు చేశారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ చందన దీప్తి ఆధ్వర్యంలో 450 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.
- ఇదీ చూడండి : కరుణామయుడే ప్రేమగా పిలిచే అద్భుత నిలయం