మెదక్ జిల్లాలోని మిల్లర్లతో అదనపు కలెక్టర్ నగేష్ సమావేశమయ్యారు. వానాకాలం బియ్యం సేకరణ, పౌర సరఫరాల సంస్థకు బాకీ ఉన్న బియ్యం ఆలస్యం జరుగుతున్న అంశంపై చర్చించారు. రైతులకు నష్టం జరగకుండా ధాన్యం సేకరించి ప్రభుత్వానికి అందించాలని ఆదేశించారు. కరోనా కారణంగా ఎఫ్సీఐ గతవారం రోజులుగా మూసి ఉందని లేకపోతే.. మెదక్ జిల్లా బియ్యం సేకరణ దాదాపు పూర్తి అయ్యి ఉండేదని.. అయినప్పటికీ ధాన్యం సేకరణ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
జిల్లాకు అదనంగా కేటాయించిన బియ్యం 2700 టన్నులను బాయిల్డ్ మిల్లర్లు జులై 15వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ మెదక్ జిల్లా గోదాంలలో అందజేయాలని ఆదేశించారు. మిగతా బాయిల్డ్ బియ్యం 7888 టన్నులు, ఎఫ్సీఐకి ఈ జులై 25 కల్లా అందించాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ధాన్య సేకరణ పూర్తి చేసిన మిల్లర్లు, అధికారులను అభినందించారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్, అసిస్టెంట్ మేనేజర్ రాజునాయక్, రైస్ మిల్లర్ల అధ్యక్షుడు, మునిసిపల్ చైర్మన్ చంద్రపాల్, మిల్లు యజమానులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: తెలంగాణలో ఆకలి చావుల్లేవు: హైకోర్టు