మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో కుటుంబీకులు ఆస్తి పంచివ్వడం లేదని పట్టణానికి చెందిన మార్కు యాదగిరి అనే వ్యక్తి సెల్ టవర్ ఎక్కి హంగామా సృష్టించాడు. తనకు రావాల్సిన ఆస్తిని పంచివ్వకపోతే.. టవర్ పై నుంచి దూకి చనిపోతానని బెదిరించాడు. స్థానికులు రామాయంపేట పోలీసులకు సమాచారం ఇవ్వగా సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యాదగిరికి నచ్చజెప్పి టవర్ పై నుంచి కిందకు దిగేలా చేశారు.
ఇదీ చూడండి: లారీని ఢీకొట్టిన కారు... సర్పంచ్ సహా ఇద్దరు మృతి