మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. నిలిచి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో శ్రీధర్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా... రవి అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. యువకుడు మృతి చెందడం వల్ల కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
ఇవీ చూడండి: 'మీ డబ్బు ఎవడికి కావాలి.... న్యాయం చేయండి చాలు'