మెదక్ జిల్లాలో ఆర్టీసీ సమ్మె విరమించి విధుల్లోకి చేరడానికి వచ్చిన మహిళా సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్ర ఐకాస పిలుపుమేరకు కార్మికులు విధుల్లోకి చేరడానికి ఉదయం నుంచి డిపోలకు తరలివచ్చారు. పోలీసులు వారిని అడ్డుకొన్నారు.
విధుల్లోకి వచ్చిన మహిళా సిబ్బంది అరెస్టు డిపో లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంపై మహిళ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. గేటు ముందు బైఠాయించి నిరసన తెలిపారు. స్వచ్ఛందంగా విధుల్లోకి వచ్చినా అధికారులు చేర్చుకోకపోవడం బాధాకరమన్నారు. అనంతరం పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఇవీ చూడండి: రాష్ట్రవ్యాప్తంగా డిపోల వద్ద ఉద్రిక్తత..